ొత్త చిట్కా ..... తలలో పేలు పోవటానికి మొదట షాంపూతో కడగి , వంద గ్రాముల పెవికాల్ దట్టంగా పట్టించి ముప్పయి నిమిషాల తరువాత గిల్లెట్ బ్లేడును ఉపయోగించండి. మీ తలలో పేలు మాయం..*.*.*.*.*.*.*.*.*గొప్ప వాళ్ళందరికీ కొత్త ఆలోచనలు బాత్రుముల్లో వస్తాయట మరి మీకు ?.*.*.*.*.*.*నువ్వు ఏదైనా కొత్త పని చేసి ఓడి పోయినప్పుడు " చూసావా మేము ముందే చెప్పాము కదా " అన్న వాళ్ళే నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కోసం తమ చేతులను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచు కుంటారు..*.*.*.*.*.*.*

Sunday, June 19, 2011



పట్నం లో ఉండే యోగిరావు కు సెల్ఫ్ కాన్ఫిడెన్సు కూసంత ఎక్కువ.
ఒకసారి రైలులో ప్రయాణం చేస్తున్నాడు. అతనికి ఎదురుగా ఒక పల్లెటూరి ఆసామి కూర్చున్నాడు.
ప్రయాణం ఉల్లాసంగా ఉండాలని మాటలు కలిపాడు మన యోగిరావు
"ఏమోయ్ పెద్ద మనిషి , ఎక్కడికి పోతున్నవ్ ?"
" రామాపురమండి"
"ఎంత దూరముంటుంది ?"
"ఒక గంట పడుతుంది".
" మనం సరదాకి ఒక ఆట ఆడుకుందామా ? "
" ఎం ఆటండి ?"
"నేను ఒక ప్రశ్న అడుగుతాను. నీకు సమాదానం తెలీకపొతే నాకు పది రూపాయలు ఇవ్వాలి.
నీవు కూడా ఒక ప్రశ్న అడుగు. నాకు సమాదానం తెలీక పొతే నేను నీకు వంద రూపాయలు ఇస్తాను."
"సరే . ఆట బాగుందండి, మొదట నేను అడుగుతాను ".
ఒకే అడుగు
"మూడు కాళ్ళ జంతువూ తాడిచెట్టు ఎక్కడానికి మూడు గంటలు తీసుకుంటుంది, దిగడానికి మూడు నిమిషాలు పడుతుంది. ఏమిటది. ? "
"....."
కాదు
"..........."
"కాదు "
"సరే , నాకు తెలీదు, ఇదిగో వంద రూపాయలు , ఇంతకీ ఏమిటది ? "
పల్లెటూరి ఆసామి పది రూపాయలు తిరిగి ఇస్తూ నాకు కూడా తెలియదు " అన్నాడు.

Monday, June 13, 2011

సాయంత్రం సమయం లో రాజ రావు బీచ్ లో నడుస్తున్నాడు. అతని కాలికి ఒక సీసా తగిలింది. అది సముద్రం నుండి ఒడ్డుకు వచ్చింది. నల్లగా పొడవుగా ఉంది. చూస్తే బయటి నుండి ఏమి కనిపించడం లేదు. క్యూరియాసిటీ తో దాని బిరడా ను తీసాడు. వెంటనే అందులోంచి జీని బూతం బయటకు వచ్చింది.
జీని bootam: "మీరు నన్ను బంద విముక్తుడిని చేసారు. కాబట్టి మీకు నేను మూడు బహుమతులు ఇస్తాను . కోరుకోండి "
రాజారావు : " నాకు ఒక పెద్ద కారు కావాలి "
జీని బూతం : "Granted "
రాజ రావు ప్రక్కనే ఒక పెద్ద బెంజ్ కారు ప్రత్య క్ష మైనది.
జీని బూతం : " మరొకటి కోరుకోండి "
రాజ రావు :నాకు ఒక పెద్ద బంగ్లా , స్విస్ బాంక్ లో నా పేరు మీద వంద కోట్ల రూపాయల ఎకౌంటు కావాలి. "
జీని బూతం : "Granted "
రాజ రావు : నన్ను అందరు అమ్మాయిలు ఇస్తా పడే విదంగా చెయ్యి
జీని బూతం : " ఓకే "
రాజ రావు ఒక ఐస్ క్రీం గా మారిపోయాడు

Friday, June 10, 2011



భర్త : "ఒక వేళ నేను చనిపోతే నీవు మళ్లీ పెళ్లి చేసుకుంటావా ?
భార్య : లేదు , పెళ్లి కాని నా సిస్టర్ తో ఉండిపోతాను.
మరి నీవు ?
భర్త : dont worry , అప్పుడు కూడా నేను నీ సిస్టర్ తో ఉంటాను.

రిజర్వేషన్



అమెరికా లో ఒక సమావేశము జరుగుతున్నది.
అమెరికా ప్రసిడెంట్ మాట్లాడుతూ
మా దేశం తరపున ఈ సం వ స్తరం మా తరపున చంద్రుని మీదకు 15 మందిని పంపిస్తున్నాము.
మన ప్రధాన మంత్రి లేచి
మేము మా దేశం తరపున 7 OBC, 5 SC, 8 ST, 3 Handicapped,
2 Sports Persons, 3 Terrorist Affected,
3 Kashmiri Migrants, 2 MPs & ఒక
శాస్త్రవేత్తను పంపిస్తున్నాము అని చెప్పాడు

Thursday, June 9, 2011

పరీక్ష



ఒక రోజు కాస్తంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గిరికెళ్లాడు తిమ్మన్న.
డాక్టర్ మూత్ర పరీక్ష చేయించుకురమ్మని రాస్తే ల్యాబ్‍కు వెళ్లాడు.
అక్కడ చాంతాడంత క్యూ ఉంది. తన వంతు కోసం వేచి చూస్తూంటే వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు "ఎందుకేడుస్తున్నావు " పలకరించాడు తిమ్మన్న.
"Doctor నన్ను రక్త పరీక్ష చేయించుకు రమ్మన్నారు"
"అయితే ?"
"రక్తం కోసం సూదితో వేలి చివర పొడిచారు. అక్కడ చాల నొప్పిగా ఉన్నది"
అంతే.... ల్యాబ్ నుంచి ఒక్క పరుగున బయటికెళ్ళి పోయాడు
తిమ్మన్న.

Sunday, June 5, 2011

ఉత్తినే




రాము సీత కొట్టగా పెళ్ళైన దంపతులు. పట్నం లో కొత్తగా కాపురం పెట్టారు.
ఒక రోజు దూరపు బంధువు నర్సయ్య పల్లెటూరి నుండి వచ్చాడు.

ఆదివారం. ఉదయమే రాము బజారుకు వెళ్లి మటన్ తెచ్చాడు. ముగ్గురు బొంచేసారు
ఉన్నది ఒకటే రూం. సీతకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయిన ఒక్కరోజే కదా అని సరిపెట్టుకుంది.

సోమ వారం. రాము బజారుకు వెళ్లి చికెన్ తెచ్చాడు. బందువు ఆ రోజు కూడా వెళ్ళలేదు.
మరుసటి రోజు పప్పు వండినది. ఆ రోజు కూడా బందువు వెళ్ళలేదు.
తరువాత రోజు కూరగాయలు. సీతకు ఒళ్ళు మండినది. కేవలం పచ్చడి ....
అయిన బందువు వెళ్ళలేదు. తరువాత కేవలం కారం. అయిన ఆ బందువు వెళ్ళలేదు.

రాముకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇహ ఇద్దరికీ కోపం వచ్చింది. కూర్చొని ఒక ఉపాయం ఆలోచించారు.

ఉదయానే సీత ప్లాన్ ను అమలులో పెట్టింది. " ఛిఛి ఎం బతుకో నాది, ఉదయం నుంచి సాయంతం వరకు ఒకటే పని " అని అంటూ ఒక గ్లాసును నేలకు విసిరింది.
అది విన్న రాము " ఇంట్లో పని ఆడవాళ్ళూ చేయక మగవాళ్ళు చేస్తారా ? నోర్ముసుకొని చెయ్యి " అన్నాడు.
సీత గయ్యున లేస్తూ " మీ మగవాళ్ళే అంతా ...
....
నీ వాళ్ళను గడ్డకు పెట్ట .... బొంద పెట్ట ...
నీ వంశమే అలాంటిది "
రాము కు ఆవేశం ఆగలేదు " ఎం మాట్లాడు తున్నవే
.... దొంగ మున్ ...
.... తినే ఇంట్లో కూర్చొని పని చెయ్యడానికే అంత గొడవ చేస్తున్నావు.. నీ కే అంట కోప వస్తే
నా కెంత రావలె ...
... " అంటూ కొట్టడానికి చెయ్యి లేపాడు.
ఇదంతా చూస్తున్న నర్సయ్యకు పరిస్తితి అర్ధం అయ్యింది. వెంటనే లేచి " ఇహ నేను వేల్లోస్తాను " అని బట్టలు సర్దుకొని బయటకు వెళ్ళిపోయాడు.
నర్సయ్య వెళ్ళిపోయినా గంట తరువాత రాము సీత ఇలా మాట్లాడుకుంటున్నారు
సీత : నేను మిమ్ముల్ని నిజంగా తిట్టననుకున్నారా ? అంతా ఉత్తినే , బాగా నటించనా ?
రాము : నేను నిజంగానే కొడుతననుకున్నావా ? నేను కూడా బాగా నటించాను కదా ! "
అప్పుడే లోపలి వస్తూ నర్సయ్య " నేను నిజంగానే వేల్లిపోయననుకున్నారా ? నేను కూడా బాగా నటించాను కదా "