ొత్త చిట్కా ..... తలలో పేలు పోవటానికి మొదట షాంపూతో కడగి , వంద గ్రాముల పెవికాల్ దట్టంగా పట్టించి ముప్పయి నిమిషాల తరువాత గిల్లెట్ బ్లేడును ఉపయోగించండి. మీ తలలో పేలు మాయం..*.*.*.*.*.*.*.*.*గొప్ప వాళ్ళందరికీ కొత్త ఆలోచనలు బాత్రుముల్లో వస్తాయట మరి మీకు ?.*.*.*.*.*.*నువ్వు ఏదైనా కొత్త పని చేసి ఓడి పోయినప్పుడు " చూసావా మేము ముందే చెప్పాము కదా " అన్న వాళ్ళే నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కోసం తమ చేతులను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచు కుంటారు..*.*.*.*.*.*.*

Friday, November 11, 2011

సినిమా సిత్రాలు


సినిమాలలో సాదారణంగా కనిపించే (అనిపించే ) విషయాలు
1 సినిమాలో ఇద్దరు కవలలు ఇఅయితే వారిలో ఒకడు తప్పకుండా తెలివి తక్కువ వాడు లేదా వానిలో విలన్ లక్షణాలు ఉంటాయి

2 బాంబ్ ను పేలకుండా హీరో పేలకుండా చేసే తప్పుడు మనం టెన్షన్ పడవద్దు. హీరో తప్పకుండ సరియైన వైరును కట్ చేస్తాడు.

3 హీరో విలన్ చేతిలో లేదా ఎవరితోనైనా దెబ్బలు తిన్నప్పుడు అతనికి నొప్పి ఉండదు. కాని ఎవరైనా మందు రాస్తే మాత్రం నొప్పిగా ఉంటుంది. 

4  విలన్ గన్ తో ఎన్ని సార్లు కాల్చిన ( ఆ విలన్ కు గన్ ప్రాక్టీసు బాగా ఉన్నా కూడా ) హీరో కు బుల్లెట్స్ తగులవు. కాని హీరో ఒక్క సారి కాలిస్తే  ( హీరో కు గన్ కొత్త  అయినా) విలన్ కు  తగులుతుంది.

5  హీరో పోలీసు అయినట్లయితే అతడు సస్పెండ్ అయిన తరువాతనే కేస్ పరిష్కరిస్తాడు.

6  హీరో బజారులో డాన్సు చేస్తే అతని వెనుక వంద మంది డాన్సు చేస్తారు. హీరో డాన్సు స్టెప్స్ వారికి ముందుగానే తెలిసిపోతాయి.

7  హీరో చెల్లెలిని వేరెవరు ఏడ్పించ కూడదు,  కాని హీరో వేరే వాళ్ళ చెల్లెలిని మాత్రం ఏడ్పించ వచ్చు .ఆమెను ఎంత ఏడిపిస్తే అంత హీరో ను ప్రేమిస్తుంది.

Wednesday, September 28, 2011

మన పురాణాలు - ప్రదేశాలు

ఇంతకు ముందు పోస్ట్ లో ఉన్న అన్ని ప్రదేశాలు (దాదాపుగా ) దేవాలయాలుగా చారిత్రక ప్రదేశాలుగా వెలిసాయి. ఉదాహరణకు కొన్ని .....


అహోబిలం 



దమౌలి 

దేహ్ర దూన్ అరణ్యం

ద్వారకా 

ఝాన్సీ 

గిర్నార్ 


గ్వాలియర్ 

హస్తిన పుర 

కురుక్షేత్ర 

మధుర 

మహేశ్వరం 

నేపాల్ 

పోరుబందర్ 

పంజాబ్ ప్రోవేన్సు

సీతా పుర , ఉత్తరప్రదేశ్

సోనిట్ పూర్

Sunday, September 25, 2011

మన పురాణాలలో ఇతిహాసాలలో పేర్కొన బడిన ప్రదేశాలు

మన పురాణాలలో ఇతిహాసాలలో పేర్కొన బడిన ప్రదేశాలు ప్రస్తుతం ఈ పేర్లతో పిలువబడుతున్నాయి
మంచి విషయం కొత్త విషయం మరొకరి వద్ద నుండి తెలుసుకొని పదిమందికి తెలియ చేయడంలో తప్పు లేదని భావించేవాడిని కావున ఈ వివరాలు శ్రీకాంత్ గారి బ్లాగ్ నుండి తీసుకొనబడినవి

ఈ ప్రదేశాల కొరకు మరో పోస్ట్ చూడుము
  1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
  2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
  3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
  4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
  5. శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం, దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
  6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
  7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
  8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
  9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
  10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్ 
  11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
  12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్ 
  13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర
  14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
  15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
  16. వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
  17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్
  18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
  19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
  20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా
  21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
  22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
  23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్
  24. శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
  25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
  26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
  27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర 
  28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
  29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్
  30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
  31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
  32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
  33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్
  34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్
  35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
  36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
  37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
  38. శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
  39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
  40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
  41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
  42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్
  43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
  44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్
  45. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
  46. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
  47. కాంభోజ రాజ్యం - ఇరాన్ (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది)
  48. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
  49. గోకర్ణ,శివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
  50. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
  51. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
  52. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
  53. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్
  54. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది
  55. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్
  56. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
  57. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
  58. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
  59. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు-శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
  60. దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు
  61. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్
  62. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర
  63. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక
  64. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక
  65. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి,కొప్పాళ,కర్ణాటక
  66. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం-తుంగభద్ర నదీతీర ప్రాంతం,హంపి దగ్గర,కర్ణాటక
  67. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు
  68. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
  69. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక
  70. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
  71. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
  72. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక
  73. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
  74. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్
  75. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
  76. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
  77. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్ 

Wednesday, September 21, 2011


MBBS చదువు తున్న  రాజు , తన మిత్రుడు గోవిందు ను తన ల్యాబ్ లోకి తీసుక వెళ్ళాడు. ఆ రోజు అక్కడ కప్పల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. 
రాజు మొదట ఒక కప్పు కాలు కోసి జంప్ అన్నాడు. అది మూడు కాళ్ళతో ముందుకు దూకింది. 
రాజు మరో కాలు కోసి జంప్ అన్నాడు. అది రెండు కాళ్ళతో ముందుకు దూకింది.
రాజు మరో కాలు కోసి జంప్ అన్నాడు. అది ఒక  కాలు తో ముందుకు దూకలేక పోయింది.
వెంటనే గోవిందు ఇలా అన్నాడు. కప్పు మూడు కాళ్ళు తీసివేస్తే దానికి చెముడు వచ్చింది .

నీదే ఆలస్యం


భార్య భర్తలిద్దరూ ఆగ్రా వెళ్ళారు. రాత్రి వెన్నెలలో తాజ్ మహల్ ముందు కూర్చొని ఈవిధంగా మాట్లాడుకుంటున్నారు,
భార్య :షాజహాన్ చాల గ్రేట్ కదా !
భర్త : ఎందుకు ?
భార్య : ముంతాజ్ కోసం ఇంట అందమైన కట్టడం నిర్మించినాడు, 
" నేను కూడా మొన్న ఉప్పల్ లో 500 గజాలు ల్యాండ్ కొన్నాను. నేను కట్టిస్తాను. ఇక నీదే ఆలస్యం " కసిగా అన్నాడు భర్త .

Monday, September 19, 2011

స్థల ప్రభావం

రాజు శ్రీను గొడవ  పడుతున్నారు మరో ఇద్దరు అక్కడ చేరి వారి లో ఎవరు రైటూ ఎవరు తప్పు అని వీరిదరు 
గొడవ పడుతుంటే ఆ ప్రదేశం ---- కలకత్తా 
రాజు శ్రీను కత్తులతో పోడుచుకున్తున్నారు. చంపుకుంటూ న్నారు . ఎవరు పట్టించు కుంటలేరు 
అటువంటి ప్రదేశ్ కచ్చితంగా --- ముంబై 
రాజు శ్రీను గొడవ  పడుతున్నారు. అక్కడ గుంపు తయారైంది . అక్కడ ఒక షాపు తెరిస్తే ఆ ప్రదేశం -- కేరళ 
రాజు శ్రీను గొడవ  పడుతున్నారు  రాజు శ్రీను ను కత్తితో పొడిచాడు. శ్రీను రకపు మడుగులో కొట్టుకుంటున్నాడు. శ్రీను ను ఒక టివి చానెల్ వాడు ఇంటర్వు చేస్తే ఆ ప్రదేశ ఖచ్చితంగా - హైదరాబాద్



మాట ముచ్చట



ఇద్దరు సామాన్యులు ఈవిధంగా  మాట్లాడుకుంటారు 
ఎలా వున్నారు ? 
నేను బాగున్నాను మీరు ?
ఇద్దరు మానసిక శాస్త్రవేత్తలు ఈవిధంగా  మాట్లాడుకుంటారు 
మీరు బాగున్నారు , నేను బాగున్ననా ?
ఇద్దరు నిరాశావాదులు ఈవిధంగా  మాట్లాడుకుంటారు 
ఎలా వున్నారు ? 
నేను తప్ప మీరంతా బాగానే ఉన్నారు 
నేను అలానే అనుకుంటునాను 
ఇద్దరు మూర్ఖులు ఈవిధంగా  మాట్లాడుకుంటారు 
ఎలా వున్నారు ? 
నేను బాగానే ఉన్నాను , రాత్రి రాజు క్లబ్ లో బాగా తాగి పదిపయదట మీకు తెలుసా ?

Saturday, September 17, 2011

How many ?