ొత్త చిట్కా ..... తలలో పేలు పోవటానికి మొదట షాంపూతో కడగి , వంద గ్రాముల పెవికాల్ దట్టంగా పట్టించి ముప్పయి నిమిషాల తరువాత గిల్లెట్ బ్లేడును ఉపయోగించండి. మీ తలలో పేలు మాయం..*.*.*.*.*.*.*.*.*గొప్ప వాళ్ళందరికీ కొత్త ఆలోచనలు బాత్రుముల్లో వస్తాయట మరి మీకు ?.*.*.*.*.*.*నువ్వు ఏదైనా కొత్త పని చేసి ఓడి పోయినప్పుడు " చూసావా మేము ముందే చెప్పాము కదా " అన్న వాళ్ళే నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కోసం తమ చేతులను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచు కుంటారు..*.*.*.*.*.*.*

Friday, November 11, 2011

సినిమా సిత్రాలు


సినిమాలలో సాదారణంగా కనిపించే (అనిపించే ) విషయాలు
1 సినిమాలో ఇద్దరు కవలలు ఇఅయితే వారిలో ఒకడు తప్పకుండా తెలివి తక్కువ వాడు లేదా వానిలో విలన్ లక్షణాలు ఉంటాయి

2 బాంబ్ ను పేలకుండా హీరో పేలకుండా చేసే తప్పుడు మనం టెన్షన్ పడవద్దు. హీరో తప్పకుండ సరియైన వైరును కట్ చేస్తాడు.

3 హీరో విలన్ చేతిలో లేదా ఎవరితోనైనా దెబ్బలు తిన్నప్పుడు అతనికి నొప్పి ఉండదు. కాని ఎవరైనా మందు రాస్తే మాత్రం నొప్పిగా ఉంటుంది. 

4  విలన్ గన్ తో ఎన్ని సార్లు కాల్చిన ( ఆ విలన్ కు గన్ ప్రాక్టీసు బాగా ఉన్నా కూడా ) హీరో కు బుల్లెట్స్ తగులవు. కాని హీరో ఒక్క సారి కాలిస్తే  ( హీరో కు గన్ కొత్త  అయినా) విలన్ కు  తగులుతుంది.

5  హీరో పోలీసు అయినట్లయితే అతడు సస్పెండ్ అయిన తరువాతనే కేస్ పరిష్కరిస్తాడు.

6  హీరో బజారులో డాన్సు చేస్తే అతని వెనుక వంద మంది డాన్సు చేస్తారు. హీరో డాన్సు స్టెప్స్ వారికి ముందుగానే తెలిసిపోతాయి.

7  హీరో చెల్లెలిని వేరెవరు ఏడ్పించ కూడదు,  కాని హీరో వేరే వాళ్ళ చెల్లెలిని మాత్రం ఏడ్పించ వచ్చు .ఆమెను ఎంత ఏడిపిస్తే అంత హీరో ను ప్రేమిస్తుంది.