ొత్త చిట్కా ..... తలలో పేలు పోవటానికి మొదట షాంపూతో కడగి , వంద గ్రాముల పెవికాల్ దట్టంగా పట్టించి ముప్పయి నిమిషాల తరువాత గిల్లెట్ బ్లేడును ఉపయోగించండి. మీ తలలో పేలు మాయం..*.*.*.*.*.*.*.*.*గొప్ప వాళ్ళందరికీ కొత్త ఆలోచనలు బాత్రుముల్లో వస్తాయట మరి మీకు ?.*.*.*.*.*.*నువ్వు ఏదైనా కొత్త పని చేసి ఓడి పోయినప్పుడు " చూసావా మేము ముందే చెప్పాము కదా " అన్న వాళ్ళే నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కోసం తమ చేతులను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచు కుంటారు..*.*.*.*.*.*.*

సేకరించినవి


మంత్రి గారి అబ్బాయి పాటశాలలో తన తోటి పిల్లలను గిల్లి రక్కి కొట్టి ఏడిపిస్తున్నాడు. బాదితుల తల్లిదండ్రులు ఈ విషయం ఫై మంత్రి గారికి చెప్పి , మీ అబ్బాయికి బుద్ది చెప్పమని కోరారు.
వెంటనే మంత్రి గారు " మీ సమస్యకు తక్షణ కర్తవ్యంగా ముందు మా అబ్బాయి గోళ్ళు కత్తిరించి తరువాత బుద్ది చెప్పే విషయం లో ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటాను.