ొత్త చిట్కా ..... తలలో పేలు పోవటానికి మొదట షాంపూతో కడగి , వంద గ్రాముల పెవికాల్ దట్టంగా పట్టించి ముప్పయి నిమిషాల తరువాత గిల్లెట్ బ్లేడును ఉపయోగించండి. మీ తలలో పేలు మాయం..*.*.*.*.*.*.*.*.*గొప్ప వాళ్ళందరికీ కొత్త ఆలోచనలు బాత్రుముల్లో వస్తాయట మరి మీకు ?.*.*.*.*.*.*నువ్వు ఏదైనా కొత్త పని చేసి ఓడి పోయినప్పుడు " చూసావా మేము ముందే చెప్పాము కదా " అన్న వాళ్ళే నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కోసం తమ చేతులను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచు కుంటారు..*.*.*.*.*.*.*

Sunday, June 5, 2011

ఉత్తినే




రాము సీత కొట్టగా పెళ్ళైన దంపతులు. పట్నం లో కొత్తగా కాపురం పెట్టారు.
ఒక రోజు దూరపు బంధువు నర్సయ్య పల్లెటూరి నుండి వచ్చాడు.

ఆదివారం. ఉదయమే రాము బజారుకు వెళ్లి మటన్ తెచ్చాడు. ముగ్గురు బొంచేసారు
ఉన్నది ఒకటే రూం. సీతకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయిన ఒక్కరోజే కదా అని సరిపెట్టుకుంది.

సోమ వారం. రాము బజారుకు వెళ్లి చికెన్ తెచ్చాడు. బందువు ఆ రోజు కూడా వెళ్ళలేదు.
మరుసటి రోజు పప్పు వండినది. ఆ రోజు కూడా బందువు వెళ్ళలేదు.
తరువాత రోజు కూరగాయలు. సీతకు ఒళ్ళు మండినది. కేవలం పచ్చడి ....
అయిన బందువు వెళ్ళలేదు. తరువాత కేవలం కారం. అయిన ఆ బందువు వెళ్ళలేదు.

రాముకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇహ ఇద్దరికీ కోపం వచ్చింది. కూర్చొని ఒక ఉపాయం ఆలోచించారు.

ఉదయానే సీత ప్లాన్ ను అమలులో పెట్టింది. " ఛిఛి ఎం బతుకో నాది, ఉదయం నుంచి సాయంతం వరకు ఒకటే పని " అని అంటూ ఒక గ్లాసును నేలకు విసిరింది.
అది విన్న రాము " ఇంట్లో పని ఆడవాళ్ళూ చేయక మగవాళ్ళు చేస్తారా ? నోర్ముసుకొని చెయ్యి " అన్నాడు.
సీత గయ్యున లేస్తూ " మీ మగవాళ్ళే అంతా ...
....
నీ వాళ్ళను గడ్డకు పెట్ట .... బొంద పెట్ట ...
నీ వంశమే అలాంటిది "
రాము కు ఆవేశం ఆగలేదు " ఎం మాట్లాడు తున్నవే
.... దొంగ మున్ ...
.... తినే ఇంట్లో కూర్చొని పని చెయ్యడానికే అంత గొడవ చేస్తున్నావు.. నీ కే అంట కోప వస్తే
నా కెంత రావలె ...
... " అంటూ కొట్టడానికి చెయ్యి లేపాడు.
ఇదంతా చూస్తున్న నర్సయ్యకు పరిస్తితి అర్ధం అయ్యింది. వెంటనే లేచి " ఇహ నేను వేల్లోస్తాను " అని బట్టలు సర్దుకొని బయటకు వెళ్ళిపోయాడు.
నర్సయ్య వెళ్ళిపోయినా గంట తరువాత రాము సీత ఇలా మాట్లాడుకుంటున్నారు
సీత : నేను మిమ్ముల్ని నిజంగా తిట్టననుకున్నారా ? అంతా ఉత్తినే , బాగా నటించనా ?
రాము : నేను నిజంగానే కొడుతననుకున్నావా ? నేను కూడా బాగా నటించాను కదా ! "
అప్పుడే లోపలి వస్తూ నర్సయ్య " నేను నిజంగానే వేల్లిపోయననుకున్నారా ? నేను కూడా బాగా నటించాను కదా "

No comments:

Post a Comment