
ఒక రోజు కాస్తంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గిరికెళ్లాడు తిమ్మన్న.
డాక్టర్ మూత్ర పరీక్ష చేయించుకురమ్మని రాస్తే ల్యాబ్‍కు వెళ్లాడు.
అక్కడ చాంతాడంత క్యూ ఉంది. తన వంతు కోసం వేచి చూస్తూంటే వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు "ఎందుకేడుస్తున్నావు " పలకరించాడు తిమ్మన్న.
"Doctor నన్ను రక్త పరీక్ష చేయించుకు రమ్మన్నారు"
"అయితే ?"
"రక్తం కోసం సూదితో వేలి చివర పొడిచారు. అక్కడ చాల నొప్పిగా ఉన్నది"
అంతే.... ల్యాబ్ నుంచి ఒక్క పరుగున బయటికెళ్ళి పోయాడు తిమ్మన్న.
No comments:
Post a Comment