ొత్త చిట్కా ..... తలలో పేలు పోవటానికి మొదట షాంపూతో కడగి , వంద గ్రాముల పెవికాల్ దట్టంగా పట్టించి ముప్పయి నిమిషాల తరువాత గిల్లెట్ బ్లేడును ఉపయోగించండి. మీ తలలో పేలు మాయం..*.*.*.*.*.*.*.*.*గొప్ప వాళ్ళందరికీ కొత్త ఆలోచనలు బాత్రుముల్లో వస్తాయట మరి మీకు ?.*.*.*.*.*.*నువ్వు ఏదైనా కొత్త పని చేసి ఓడి పోయినప్పుడు " చూసావా మేము ముందే చెప్పాము కదా " అన్న వాళ్ళే నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కోసం తమ చేతులను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచు కుంటారు..*.*.*.*.*.*.*

Sunday, June 19, 2011



పట్నం లో ఉండే యోగిరావు కు సెల్ఫ్ కాన్ఫిడెన్సు కూసంత ఎక్కువ.
ఒకసారి రైలులో ప్రయాణం చేస్తున్నాడు. అతనికి ఎదురుగా ఒక పల్లెటూరి ఆసామి కూర్చున్నాడు.
ప్రయాణం ఉల్లాసంగా ఉండాలని మాటలు కలిపాడు మన యోగిరావు
"ఏమోయ్ పెద్ద మనిషి , ఎక్కడికి పోతున్నవ్ ?"
" రామాపురమండి"
"ఎంత దూరముంటుంది ?"
"ఒక గంట పడుతుంది".
" మనం సరదాకి ఒక ఆట ఆడుకుందామా ? "
" ఎం ఆటండి ?"
"నేను ఒక ప్రశ్న అడుగుతాను. నీకు సమాదానం తెలీకపొతే నాకు పది రూపాయలు ఇవ్వాలి.
నీవు కూడా ఒక ప్రశ్న అడుగు. నాకు సమాదానం తెలీక పొతే నేను నీకు వంద రూపాయలు ఇస్తాను."
"సరే . ఆట బాగుందండి, మొదట నేను అడుగుతాను ".
ఒకే అడుగు
"మూడు కాళ్ళ జంతువూ తాడిచెట్టు ఎక్కడానికి మూడు గంటలు తీసుకుంటుంది, దిగడానికి మూడు నిమిషాలు పడుతుంది. ఏమిటది. ? "
"....."
కాదు
"..........."
"కాదు "
"సరే , నాకు తెలీదు, ఇదిగో వంద రూపాయలు , ఇంతకీ ఏమిటది ? "
పల్లెటూరి ఆసామి పది రూపాయలు తిరిగి ఇస్తూ నాకు కూడా తెలియదు " అన్నాడు.

No comments:

Post a Comment