
పట్నం లో ఉండే యోగిరావు కు సెల్ఫ్ కాన్ఫిడెన్సు కూసంత ఎక్కువ.
ఒకసారి రైలులో ప్రయాణం చేస్తున్నాడు. అతనికి ఎదురుగా ఒక పల్లెటూరి ఆసామి కూర్చున్నాడు.
ప్రయాణం ఉల్లాసంగా ఉండాలని మాటలు కలిపాడు మన యోగిరావు
"ఏమోయ్ పెద్ద మనిషి , ఎక్కడికి పోతున్నవ్ ?"
" రామాపురమండి"
"ఎంత దూరముంటుంది ?"
"ఒక గంట పడుతుంది".
" మనం సరదాకి ఒక ఆట ఆడుకుందామా ? "
" ఎం ఆటండి ?"
"నేను ఒక ప్రశ్న అడుగుతాను. నీకు సమాదానం తెలీకపొతే నాకు పది రూపాయలు ఇవ్వాలి.
నీవు కూడా ఒక ప్రశ్న అడుగు. నాకు సమాదానం తెలీక పొతే నేను నీకు వంద రూపాయలు ఇస్తాను."
"సరే . ఆట బాగుందండి, మొదట నేను అడుగుతాను ".
ఒకే అడుగు
"మూడు కాళ్ళ జంతువూ తాడిచెట్టు ఎక్కడానికి మూడు గంటలు తీసుకుంటుంది, దిగడానికి మూడు నిమిషాలు పడుతుంది. ఏమిటది. ? "
"....."
కాదు
"..........."
"కాదు "
"సరే , నాకు తెలీదు, ఇదిగో వంద రూపాయలు , ఇంతకీ ఏమిటది ? "
పల్లెటూరి ఆసామి పది రూపాయలు తిరిగి ఇస్తూ నాకు కూడా తెలియదు " అన్నాడు.